ఓ ప్రేమ జంట తమ పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. అందుకోసం ఇంట్లో నుంచి బైటకి వెళ్ళారు. ఈ క్రమలోనే ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్ చేతి మణికట్టుని బ్లేడ్ తో కొసేసింది. తర్వాత తాను ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన కేరళలో కోజికోడ్ జిల్లాలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. కొడంచెరీకి చెందిన ఒక యువతి ఓ యువకుడితో రిలేషన్షిప్లో ఉంది. ఈ విషయం ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తామరస్సెరీ బస్టాండ్ వద్ద బస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా యువతి రేజర్ బ్లేడ్ తీసి తన బాయ్‌ఫ్రెండ్ చేతి మణికట్టును కట్ చేసింది. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో స్థానికులు ఇద్దరినీ కాపాడి.. తామరస్సే తాలూక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.