‘డ్రగ్స్‌కు అలవాటు పడినవారిలో అమ్మాయిలే ఎక్కువ’

-

డ్రగ్స్కు అలవాటుపడిన వారిలో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు. కోవిడ్ సమయంలో చాలామంది డ్రగ్స్, గంజాయికి అలవాటు పడ్డారని వెల్లడించారు. ఇలా దేశంలో మొత్తం 11.5 కోట్ల మంది డ్రగ్స్క అలవాటుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీగా మార్చడానికి నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Hyderabad: After CI Molestation Case CP CV Anand Transfers 69 Inspectors -  Sakshi

కాగా.. ప్రస్తుతం మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ కలకలం చెలరేగింది. కేపీ చౌదరి అనే నిర్మాత డ్రగ్స్ విక్రయిస్తూ కొన్నిరోజుల క్రితం అరెస్ట్ అయ్యారు. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు టాలీవుడ్‌లో కలకలం రేపుతుంది. కేపీ చౌదరి కస్టడీ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. పోలీసుల విచారణలో 12 మందికి తాను డ్రగ్స్ సరఫరా చేసినట్లు కేపీ చౌదరి ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news