Glenn Maxwell : భారత మహిళను పెళ్లి చేసుకోనున్న గ్లెన్ మాక్స్‌వెల్‌..వెడ్డింగ్ కార్డు వైరల్

-

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాక్స్వెల్ కు ఆస్ట్రేలియాలో కంటే ఇండియా లోనే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. తనదైన ఆటతో… డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్షన్ తో క్రికెట్ ఫాన్స్ ను ఆకట్టుకున్నాడు మాక్స్ వెల్. అయితే తాజాగా ఈ బ్యాట్స్మెన్ ఇంటి వాడు కాబోతున్నాడు.

తన చిరకాల గర్ల్ ఫ్రెండ్ విని రామన్ మెడలో… హిందూ సాంప్రదాయం ప్రకారం..3 ముళ్ళు వేసి ఏడడుగులు నడిచేందుకు.. సిద్ధమయ్యాడు మ్యాక్స్ వెల్. 2022 మార్చి 27వ తేదీన మెల్బోర్న్ వీరి వివాహం జరిగింది. అయితే పూర్తిగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరగనుంది. ఈ మేరకు తమిళంలో ప్రింట్ చేయించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

భారత సంతతికి చెందిన వినీ తల్లిదండ్రులు.. చాలా రోజుల క్రితమే ఆస్ట్రేలియా లో సెటిల్ అయ్యారు. విని రామన్ సైతం అక్కడే పుట్టి పెరిగారు. వృత్తి రీత్యా ఆమె ఫార్మసిస్ట్ గా పని చేస్తున్నారు. అయితే ఈ నాలుగు సంవత్సరాల కింద గ్లెన్ మాక్స్ వెల్ ప్రేమలో ఈ అమ్మడు పడిపోయింది. వీరిద్దరికీ వివాహానికి ఇరు కుటుంబాలు ఒకే చెప్పడంతో.. పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు.

Read more RELATED
Recommended to you

Latest news