గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

-

మెగాస్టార్ చిరంజీవి అప్‌క‌మింగ్ మూవీ.. “గాడ్ ఫాదర్”. మలయాళ బ్లాక్ బస్టర్ హిటైయిన లూసిఫర్ కు రీమేక్ ఈ చిత్రం. ఆల్రెడీ ఈ చిత్రం తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు మ‌ళ్లీ తెస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఇటీవల విడుదలైన టీజర్ తో మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు మేకర్స్.

ఈ టీజర్ లో మెగాస్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ నయనతార ఓ కీలకపాత్రలో నటిస్తున్న సంగతిి తెలిసిందే.  ఈ చిత్రంలో నయన్ ” సత్యప్రియ జై దేవ్” గా పరిచయం చేశారు. ఇక దీంతో పాటు మూవీ రిలీజ్ డేట్ పై కూడా సాలిడ్ క్లారిటీ ఇచ్చేశారు. సినిమా అనుకున్నట్లుగానే అక్టోబర్ 5 నే రిలీజ్ చేయనున్నట్లు ఈ పోస్టర్లో కనిపిస్తోంది. అలాగే గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో బిగ్ అప్డేట్ ను ప్రకటించారు. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది. ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి మెగాస్టార్ చిరు చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటుంది.”మార్ మార్ టక్కర్ మార్” అంటూ సాగే మాస్ సాంగ్ కి చిరు, సల్మాన్ నిలబడి సింపుల్ స్టెప్స్ వేస్తూ ఆకట్టుకున్నారు. ఈ ఫుల్ సాంగ్స్ సెప్టెంబర్ 15న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news