చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి గాడ్ ఫాదర్ సెట్ అవ్వలేదు.. పరుచూరి వైరల్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్ అందుకుంది.. అయితే తాజాగా ఈ చిత్రం పైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ..

గాడ్ ఫాదర్ పై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. మలయాళీ చిత్రం ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన కొన్ని మార్పులు బాగున్నాయని.. అయితే చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు ఇలాంటి స్లో పేస్‌ కథలు సెట్‌ కావని తెలిపారు.

”తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేలా చిన్న చిన్న మార్పులు చేసినప్పటికీ యథాతథంగా ‘లూసిఫర్‌’ కథనే ‘గాడ్‌ఫాదర్‌’గా తెరకెక్కించారు. చిత్రబృందం కష్టపడి కథలో తెలుగుదనం కనిపించేలా చర్యలు తీసుకుంది. అందుకే ఈసినిమా విజయవంతమైంది. ఇదొక కర్ణుడి కథ. తన చెల్లెళ్లకు దూరంగా ఉండే ఓ అన్నయ్య.. వాళ్లని అనుక్షణం ఎలా కాపాడాడు? వాళ్ల ప్రేమను ఎలా పొందాడు? అనే ఆసక్తికర అంశాలతో దీన్ని తెరకెక్కించారు. మాతృకలో లేనివిధంగా ‘గాడ్‌ఫాదర్‌’లో నయనతారకు ఒక చెల్లి ఉన్నట్లు చూపించారు.. ట్విస్టులను రివీల్‌ చేస్తూ కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఆయన స్క్రీన్‌ప్లేతో ఆడుకున్నారు. అయితే లూసీ ఫర్ తో పోలిస్తే తెలుగులో మంచి స్క్రీన్ ప్లే ఉందనే చెప్పాలి పరోక్షంగా తెలుగు రాజకీయాలను కలిపి చూపించినా.. కథా కథనం దృష్ట్యా చిరంజీవి బాడీ లాంగ్వాజ్ కు సరిపోయి వుంటే బాగుండేది అనిపించింది.. చిరంజీవికి తగ్గ పాత్ర కాకపోయినా డైరెక్టర్ ఈ విషయంలో చాలా వరకు విజయం సాధించారు అయితే సినిమాలో చిరుకి డాన్సులు లేకపోవడం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది.. “అంటూ వివరించారు పరుచూరి..