మ‌రోసారి పైకెగసిన బంగారం ధరలు.. వెండి కూడా..

-

నేడు మ‌రోసారి బంగారం ధ‌ర పైకెగ‌సింది. పది గ్రాముల బంగారం ధర మంగళవారంతో పోలిస్తే 100 రూపాయల వరకూ పెరిగింది. కాగా, వెండి ధరలు కుడా అదేబాట పట్టాయి. బుధవారం భారీగా తగ్గిన వెండి గురువారం తిరిగి అదే స్థాయిలో కేజీకి 400 రూపాయలు పెరిగింది. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 80 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల ధర 39,960 రూపాయలకు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది.

దీంతో 36,630 రూపాయల వద్దకు చీరుకుంది. ఇక వెండిధరలు కేజీకి 400 పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,900 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,960రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,630 రూపాయలకు పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news