గుడ్ న్యూస్‌: దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు మిశ్రమంగా కదిలాయి. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉంది. దీంతో 39,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 70 రూపాయల తగ్గుదలతో 36,150 రూపాయల వద్దకు చేరింది. అయితే, వెండి ధర కూడా స్వల్పంగా కేజీకి 10 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,690 వద్ద నిలింది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,100 రూపాయల వద్ద నిలకడగా ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 36,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక వెండి ధర ఇక్కడా స్వల్పంగా కేజీకి 10 రూపాయలు తగ్గింది. దీంతో వెండి కేజీకి 46,690 రూపాయల వద్ద నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news