గుడ్ న్యూస్ : భారీగా తగ్గిపోయిన బంగారం, వెండి ధరలు..!

-

మొన్నటిదాక ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఎట్టకేలకు దిగొచ్చాయి. వరుసగా మూడు రోజులు పాటు బంగారం ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.440 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.58,300 కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్లపై అంతే పెరగడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.53,140 కి పెరిగింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.. కేజీ వెండి ధర ఏకంగా రూ.2650 పడిపోయింది. దీంతో ధర రూ.72,500కి చేరింది. ఢిల్లీ మార్కెట్‌లోనూ కూడా పసిడి ధర దిగొచ్చింది.. నేడు మార్కెట్‌లో రూ.650 మేర ధర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,700 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,450కి చేరింది. కేజీ వెండి ధర రూ.2650 తగ్గడంతో రూ.72,500 కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news