సెప్టెంబర్‌ 5 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌.. కేవలం అక్కడ మాత్రమే..!

-

క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో హైకోర్టు కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. తెలంగాణ న్యాయ వ్య‌వ‌స్థ లాక్‌డౌన్‌ను మ‌రోసారి పొడిగించింది. రాష్ట్రంలో కోర్టుల లాక్‌డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అత్య‌వ‌స‌ర‌, తుది విచార‌ణ కేసులు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచారించాల‌ని జిల్లా కోర్టుల‌కు ఉత్త‌ర్వులో పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా… ఇతర జిల్లాలలోని కోర్టుల్లో నేరుగా పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

high-court
 

కోర్టుల వద్ద శానిటైజేషన్, మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 82 వేల కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 645 కి చేరుకుంది. ఒకవేళ పరిస్థితి ఇలానే కొనసాగితే హైకోర్టు మరోసారి లాక్ డౌన్ పొడిగించే అవకాశం లేకపోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news