మట్టిదిబ్బలో బంగారు నాణేలు..అసలు నిజం ఇది..!

-

ఏపీ,తమిళనాడు సరిహద్దులో ఉన్న మట్టి దిబ్బలో బంగారు నాణేలు దొరుకుతున్నాయన్నారు. ఇంకేముంది సమీప గ్రామాల ప్రజలు.. కుప్పలుతెప్పలుగా తరలివచ్చారు. నిన్న ఒక్కరోజే కాదు.. ఇవాళ కూడా సేమ్‌ సీన్. దీంతో ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడం.. పోలీసులకు తలనొప్పిగా మారింది. చివరికి నాణేల గురించి అసలు విషయం తెలిసింది ? ఇంతకీ నాణేల వెనుక ఉన్న రహస్యం ఏంటి ?

తమిళనాడు సరిహద్దులోని హోసూరు తాలూకా బాగలూరు – సజ్జాపురం రోడ్డులోని పోలీసు క్వార్టర్స్‌ సమీపంలోని మట్టిదిబ్బల్లో నాణేలు బయటపడ్డాయి. హోసూరు-బాగలూరు రహదారి వెంట ఉన్న ఆ మట్టి దిబ్బలో బంగారు నాణేలు ఉన్నాయన్న సమాచారంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దాంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక నాణేలు దొరికిన చోటైతే… మినీ యుద్ధమే జరుగుతోంది. నాణేల కోసం తోపులాటలు, ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. ఒక్కో నాణెం 2 గ్రాముల బరువు ఉంటుందని అంచనా. వీటిపై అరబిక్ లిపిలో అక్షరాలు ఉన్నాయి.

మట్టి దిబ్బల్లోకి ఆ నాణేలు ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో… రెండో రోజు కూడా హోసూరు-బాగలూర్ రోడ్డుపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. చివరికి ప్రజల ఆశలపై అధికారులు నీళ్లు చల్లారు. అవి బంగారు నాణేలు కావనీ, ఇత్తడి నాణేలని తేల్చారు. నిన్న దొరికినవి కూడా ఇత్తడివేననీ… కానీ బంగారు నాణేలని ప్రచారం జరగడంతో.. జనం ఎగబడ్డారని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news