అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజల్ని అలర్ట్ చేయండి : హరీశ్ రావు

-

హైదరాబాద్ బీఆర్కే భవన్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్ని జిల్లాn కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద నేపథ్యంలో సీజనల్, అంటు వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లతో చర్చిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్, పంచాయతీ రాజ్ , విద్యాశాఖ, బీసీ సంక్షేమ, మున్సిపల్, వైద్యారోగ్య శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తోన్న వేళ వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. ముంపు ప్రాంతాల ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించాలని.. ఆ కేంద్రాల్లో అన్ని రకాల వసతులు ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు చెప్పారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండనీయకుండా.. దోమలు ప్రబలకుండా చూసే బాధ్యత తీసుకోవాలన్నారు.

మరోవైపు వరదల వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పంట నష్టంపై ఓ అంచనాకు వచ్చి.. రైతులకు సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news