గుడ్ న్యూస్ : మళ్ళీ తగ్గిన బంగారం ధర

-

గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు మళ్ళీ ఈరోజు దిగొచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే బంగారం ధర వెల వెలబోయినట్టే. అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర దిగిరావడంతో దేశీ మార్కెట్‌ లో కూడా దిగిరాక తప్పలేదు. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా భారీగానే పడిపోయింది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర 90 రూపాయల మేర అతి స్వల్పంగా తగ్గింది.

ఇక ఈ తగ్గిన రేట్ లతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,640కు చేరింది. అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,250కి చేరింది. ఢిల్లీ మార్కెట్‌ లో కాస్త ఎక్కువే బంగారం ధరలు తగ్గాయి. రూ.250 మేర బంగారం ధర తగ్గింది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర 300 తగ్గింది. దీంతో వెండి ధర రూ.60,700కు చేరింది. అయితే వెండి ధర నిన్న రూ.300 పెరిగగా అంతే ఈరోజు తగ్గడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news