తగ్గిన బంగారం ధరలు …!

-

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే బుధవారం మాత్రం బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. మంగళవారం భారీగా పెరిగింది బంగారం. హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది. అయితే  24 క్యారెట్ల బంగారం ధర మాత్రం పెరిగింది. 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 500 రూపాయల తగ్గింది. 44,240 రూపాయలుగా ఉంది.

24 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయల పెరగడం తో… 47,000 రూపాయలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 500 రూపాయల వరకు తగ్గింది. దీనితో 44,540 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 100 రూపాయల పెరగడంతో 47,000 రూపాయలకు చేరుకుంది.

దేశ రాజధాని ఢిల్లీ లో కూడా బంగారం ఇదే విధంగా  ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 600 పెరగడం తో 48,250కు చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1000 రూపాయలకు చేరుకుంది. దీనితో 46,150 రూపాయలుగా ఉంది బంగారం ధర.

Read more RELATED
Recommended to you

Latest news