బెంగళూరులో కేజీన్నర, చెన్నైలో కేజీ బంగారం.. మహిళలు ఎక్కడ దాచి తెచ్చారో తెలిస్తే షాకవ్వాల్సిందే !

-

మనతో పోలిస్తే అరబ్ దేశాల్లో బంగారం తక్కువ రేటు దొరుకుతుంది అన్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడి నుంచి బంగారం ఇక్కడికి తేవడానికి ఈ స్మగ్లర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. లీగల్ గా తీసుకువస్తే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి అధికారుల కళ్లుగప్పి భారత్లోకి బంగారాన్ని తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లో దాదాపు కేజీ బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక మహిళ తో పాటు మరో ఇద్దరు స్మగ్లర్ల నుంచి దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని పేస్టులాగా మార్చి మలద్వారంలో ఈ ముగ్గురు దాచినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

వీరి నడకలో తేడా రావడంతో స్కాన్ చేసిన కస్టమ్స్ అధికారులకు ఎట్టకేలకు దొరికేసారు దీంతో వీరి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లో కూడా కేజీ నర బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన ఒక మహిళ వద్ద ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.. అయితే ఈ మహిళ ఈ బంగారాన్ని వెన్నునొప్పి కోసం వేసుకున్న బెల్ట్ లో దాచి ఇండియా లోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేసింది. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు చెక్ చేయడంతో కేజీ నర బంగారం పట్టుబడింది.

Read more RELATED
Recommended to you

Latest news