కరోనా ప్రభావం ప్రారంభమైన నాటి నుంచీ ఇళ్లు, ఫాం హౌస్ లకే పరిమితమైన పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇకపై బయటకు రావాలని ఫిక్సయ్యారు! కరోనా వచ్చినా, విశాఖలో ప్రమాధాలు జరిగినా, వరదలు వచ్చినా, జనాలకు ఇబ్బందులు ఎదురైనా కేవలం ఆన్ లైన్ స్పందనలకే పరిమితమైన పవన్ ఇకపై బయటకు రావాలని నిర్ణయించుకున్నారు!
అవును.. కరోనా భయం నుంచి ధైర్యం తెచ్చుకున్న పవన్ కల్యాణ్ ఇల్లు, ఫాం హౌస్ వదలి బయటకు రావాలని ఫిక్సయ్యారు. అయితే.. ఇకపై తాను మద్దతిస్తున్న అమరావతి రైతుల కోసం ఉద్యమించడానికో.. విశాఖ గ్యాస్ లీక్ మృతుల కుటుంబాలను పరామర్శించడానికో.. వరద ప్రాంతాల్లో పర్యటించడానికో.. బీజేపీతో కలిసి ప్రజాసమస్యలపై ఉద్యమించడానికో కాదుసుమా… షూటింగ్ ల కోసం!
ఈ నెల 23 నుంచి వకీల్ సాబ్ షూటింగ్ ప్రారంభించబోతున్న సందర్భంగా ఈ షెడ్యూలుకు పవన్ హాజరవ్వబోతున్నారు. వకీల్ సాబ్ సినిమాకు ఇంకా కనీసం ముఫై రోజులు పవన్ పని చేయాల్సి వుంది. అన్నీ అనుకూలంగా జరిగితే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయవచ్చు!ఈ సినిమా తరువాత అయ్యప్పన్ కోషియమ్ రీమేక్.. తర్వాత.. క్రిష్ సినిమా, అనంటరం హరీష్ శంకర్ సినిమా చేయబోతున్నారు పవన్!
అయితే.. పవన్ వస్తాడు, తమకోసం ఏదో చేస్తాడు అని ప్రజలైతే పెద్దగా ఆశిస్తున్నట్లు లేదు కానీ… జనసైనికులు మాత్రం చాలా ఆశగా ఉన్నారు.! కాబట్టి జనసైనికులకు ఇది బ్యాడ్ న్యూస్ అయినప్పటికీ.. పవర్ స్టార్ అభిమానులకు మాత్రం గుడ్ న్యూసే! ఫైనల్ గా ఇది… జనసైనికులకు “బ్యాడ్” న్యూస్.. ఫ్యాన్స్ కి “గుడ్” న్యూస్.. జనాలకు “ఎక్స్ పెక్టెడ్” న్యూస్!!