KEERTHY SURESH : ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్ రిలీజ్

-

మహానటి సినిమా కీర్తి సురేశ్‌ను ఓవర్ నైట్‌ స్టార్‌ హీరోయిన్‌గా మార్చింది. వ‌రుస ఆఫ‌ర్స్ బిజీబిజీగా మారింది. ఈ న‌టి ఎక్కువ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కే అధిక ప్రాధ్యాత‌న ఇస్తోంది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ లాంటి చిత్రాల్లో న‌టించింది. అయితే.. వీటిలో పెంగ్విన్, మిస్ ఇండియా నిరాశ‌ప‌ర‌చ‌డంతో ఎలాగైనా.. గుడ్ ల‌ఖ్ స‌ఖితో మెప్పించాలని భావిస్తుంది.

అయితే తాజాగా గుడ్‌ లఖ్‌ సఖి మూవీ ట్రైలర్‌ విడుదలైంది. పుట్టుకతోనే బ్యాడ్‌ లక్‌ ను వెంటేసుకు తిరుగుతున్న ఓపల్లె టూరి అమ్మాయి.. స్టార్‌ షూటర్‌ గా ఎలా ఎదిగిందనేది కథ. దాదాపు కథ మొత్తం ట్రైలర్ లోనే చెప్పేశారు. అయితే.. ఆమె జర్నీ ఎంత ఆసక్తి సాగిందనేది ఇందులో కీలకం. కీర్తి సురేష్‌ కొత్తగా కనిపించింది. చిత్తూరు మాండలికంతో ఆకట్టుకుంది మహానటి కీర్తి సురేశ్‌. జగపతి బాబు కోచ్‌ గా కనిపించారు. ట్రైలర్‌ లో వినిపించిన డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. కాగా.. ఈ మూవీ ఈ నెల 28 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news