ఏపీ రైతులకు శుభవార్త చెప్పింది జగన్ సర్కార్. ఆక్వా ఫీడ్ ధరల పెరుగుదలపై మంత్రి సిదిరీ అప్పల్రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సిదిరీ అప్పల్రాజు మాట్లాడుతూ…. ధరలు పెరుగుతున్నాయని ఆక్వా రైతులు.. ఫీడ్ తయారీదారులు ఆందోళన వ్యక్తం చేశారని.. ఫీడ్ తయారికీ అవసరమైన ముడి సరుకువ ధరలు పెరగడంతో తమకు ఫీడ్ ధరలు పెంచక తప్పడం లేదని తయారీ దారులు చెబుతున్నారన్నారు.
ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని.. ఫీడ్ యాక్ట్.. సీడ్ యాక్ట్ ద్వారా ధరలు సహా అన్నింటిని నియంత్రించే అధికారం ఉందని వెల్లడించారు. కిలోకు 2.56 పైసలు మేర ఆక్వా ఫీడ్ ధర తగ్గించేందుకు తయారీ దారులు ముందుకు వచ్చారని తెలిపారు.
ఫీడ్ తయారీదారులకు అవసరమైన ముడి సరకు ధరల తగ్గించేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని.. ఫీడ్ తయారీకి అవసరమైన సోయ ప్రోటీనుకు ఆర్టిఫిషియల్ డిమాండ్ పెరుగుతోంది.. దీని కారణంగానే ధరలు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల వినతి మేరకు గతంలో 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సోయ ప్రొటీన్ను ఇంపోర్ట్ చేసుకునేందుకు కేంద్రం అంగీకరించిందని.. మళ్లీ సోయ ప్రొటీన్ను దిగుమతి చేసుకునేలా కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.