సీఎం స్టాలిన్ ఇంటిని బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్ !

-

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటిని బాంబులతో పేల్చేస్తామని అంటూ వచ్చిన బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి.ఎగ్మూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ అజ్ఞాత వ్యక్తి బుధవారం నాడు ఈ బెదిరింపు కాల్స్ చేశాడు. స్టాలిన్ ఇంటి వద్ద బాంబులు పెట్టామని, కాసేపట్లో అవి పేలనున్నాయని, చేతనైతే అడ్డుకోవాలని అతను పోలీసులకు సవాల్ విసిరాడు. ఈ ఫోన్ కాల్ తో పోలీసు అధికారులకు ముచ్చెమటలు పట్టాయి.

 

హుటాహుటిన బాంబు స్క్వాడ్ తో ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయాలకు వెళ్లి తనిఖీలు చేశారు. ఆ తర్వాత అది ఫేక్ కాల్ అని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఫోన్ చేసిన అగంతకుడు ఎవరు అనే విషయం పై దృష్టిసారించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం తో కలిసి నిందితుడిని పోలీసులు గుర్తించారు. తిరునల్వేలి జిల్లా సుద్దమిల్లి గ్రామానికి చెందిన తమరైకన్నన్ ఈ ఫోన్ చేసినట్లు నిర్ధారించి, అరెస్టు చేశారు. గంజాయి మత్తులో అతను ఈ ఫోన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news