నిరుద్యోగులకు అలర్ట్‌.. నేటితో ముగియ‌నున్న పోలీస్ ఉద్యోగాల‌ దర‌ఖా‌స్తు

-

తెలంగాణ సర్కార్‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేశారు. అయితే.. అందులో పోలీస్‌ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పోలీస్‌ శాఖలో ఉద్యోగాల కోసం దరఖాస్తు గడువు ఈ రోజుతో ముగియనుంది. శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. నిన్న ఒక్క‌రోజే ల‌క్ష మందికి పైగా ద‌ర‌ఖాస్తు చేసుకోవడం గమనార్హం. నిన్న‌టి వ‌ర‌కు 5.2 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, ఈ సంఖ్య 6 ల‌క్ష‌ల‌కు చేరుకునే అవ‌కాశం ఉంది.

Police Jobs: క‌ఠోర శ్ర‌మ‌తోనే ఖాకీ కొలువు!

పోలీస్‌, ఎక్సైజ్‌, ఫైర్‌, జైళ్లు, రవాణా శాఖల్లో కలిపి 17,291 యూనిఫాం ఉద్యో‌గాల భర్తీకి ఈ నెల 2 నుంచి దర‌ఖాస్తు ప్రక్రియ ప్రారం‌భిం‌చిన విషయం తెలి‌సిందే. శుక్ర‌వా‌రంతో దర‌ఖా‌స్తు‌లకు గడువు ముగు‌స్తు‌న్నది. అన్ని విభా‌గా‌లకు కలిపి గురు‌వారం వరకు 5.2 లక్షల మంది అభ్య‌ర్థుల నుంచి 9.33 లక్షల దర‌ఖా‌స్తులు వచ్చి‌నట్టు టీఎ‌స్‌‌ఎ‌ల్పీ‌ఆర్బీ చైర్మన్‌ వీవీ శ్రీని‌వా‌స‌రావు ‘న‌మస్తే తెలం‌గా‌ణ’కు తెలి‌పారు. వీటిలో మహిళా అభ్య‌ర్థుల నుంచే 2. 05 లక్షల దర‌ఖా‌స్తులు వచ్చా‌యని వెల్ల‌డిం‌చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news