ఉద్యోగులకు శుభవార్త.. కంపెనీ మార్చుకుంటే.. గ్రాట్యుటీ కూడా బదిలీ..!

-

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త అందించింది. ఉద్యోగులకు త్వరలో కొత్త వ్యవస్థను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగులకు అందించే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్‌ (ఈపీఎఫ్) ఖాతాను ఎలా బదిలీ చేసుకోవచ్చో.. అలాంటి అవకాశాన్ని గ్రాట్యుటీలో కూడా కల్పిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఎంప్లాయీస్ యూనియన్, పరిశ్రమల మధ్య ఒప్పందం కుదిరింది. ఉద్యోగులు కంపెనీ మార్చినప్పుడు గ్రాట్యుటీ కూడా బదిలీ చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ పేర్కొన్నారు. ఈ విషయంపై కేంద్రం సుముఖత చూపడంతో గ్రాట్యుటీ బదిలీకి ఒప్పుకుంది. దీంతో గ్రాట్యుటీ బదిలీని సామాజిక భద్రతా కోడ్‌కు సంబంధించిన నిబంధనలలో చేర్చబడుతుంది.

డబ్బులు
డబ్బులు

నెలాఖరిలోగా తుది నోటిఫికేషన్..
సీఎన్‌బీసీ సమాచారం ప్రకారం.. ప్రస్తుత్తం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ లాగా.. ఉద్యోగులు గ్రాట్యుటీని కూడా బదిలీ ఎంపిక లభిస్తోంది. పరిశ్రమలు, ఉద్యోగ సంఘాలలో గ్రాట్యుటీ పొర్టబిలిటీపై ఒప్పందం తర్వాత.. ఉద్యోగ మార్పు సమయంలో గ్రాట్యుటీ బదిలీ అమరికను చేర్చునున్నారు. ఇలా పీఎఫ్ లాగా.. గ్రాట్యుటీ డబ్బులను కూడా ప్రతినెలా అకౌంట్‌లో వేయనున్నారు. కార్మిక మంత్రిత్వ శాఖ, పరిశ్రమలు, ఎంప్లాయీస్ యూనియన్ సమావేశంలో ఈ ఒప్పందం కుదిరిందని ఆయా వర్గాలు తెలిపాయి. గ్రాట్యుటీని సీటీసీలో ఒక ముఖ్యమైన భాగంగా మార్చాలని కూడా ప్రతిపాదించబడింది. ఈ నిబంధన సామాజిక భద్రతా నియమావళిలో చేర్చబడుతుందని.. తుది నోటిఫికేషన్ వచ్చే నెలలో వెలువడుతుందని వారు తెలిపారు.

అయితే గ్రాట్యుటీ కల్పించడంతో పనిదినాలను పొడిగించాలని ఆయా పరిశ్రమలు తెలిపాయి. పని దినాన్ని 15 రోజుల నుంచి 30 రోజులుగా చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చింది. కేంద్రం ఈ విషయాన్ని తిరస్కరించడంతో పరిశ్రమలు వ్యతిరేకించాయి. ఒకే సంస్థలో 5 సంవత్సరాలపాటు పని చేసిన ఉద్యోగి, జీతం, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్‌తోపాటు గ్రాట్యుటీ ఉంటుంది. ఉద్యోగి జీతంలో కొంత.. సంస్థ తరఫున వచ్చే కొంత డబ్బులతో గ్రాట్యుటీ జమ చేస్తారు. ఇలా 5 ఏళ్లు ముగిసిన తర్వాత ఆయా కంపెనీలు ఉద్యోగులకు గ్రాట్యుటీ అందజేస్తాయి.

గ్రాట్యుటీ లెక్కింపు ఇలా..
ఓ ఉద్యోగి ఒకే సంస్థలో 5 సంవత్సరాల పాటు పని చేస్తే అతడికి గ్రాట్యుటీ లభిస్తుంది. ఉద్యోగులు నెలలో 26 రోజులు పని చేస్తారు. 4 రోజులు సెలవు ఉంటుంది. అయితే గ్రాట్యుటీని సంవత్సరంలో 15 రోజులుగా తీసుకుంటారు. కంపెనీ (ఉద్యోగి జీతం) x (15/26) x (5) ఆధారంగా గ్రాట్యుటీని చెల్లిస్తుంది. ఒకవేళ ఉద్యోగి జీతం 50 వేలు అనుకుంటే.. (50,000) x (15/26) x (5) = రూ.1,44,230. ఇది మొత్తం రావాల్సిన గ్రాట్యుటీ.

Read more RELATED
Recommended to you

Latest news