పెన్షనర్లకు ఎంప్లాయీస్ పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఒకవేళ కనుక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఆఖరి తేదీ లోగ పెన్షన్ రాకపోతే అప్పుడు పరిహారాన్ని పొందే అవకాశాన్ని ఇస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఒక సర్క్యులర్ ని జారీ చేసింది. ప్రతి నెలా చివరి తేదీన పెన్షనర్ల అకౌంట్లో పెన్షన్ డబ్బులు జమ అవుతాయని చెప్పింది.
వేతనం మాదిరి ఇప్పుడు ఈపీఎస్ పెన్షన్‌ను వేస్తామని తెలిపింది. అయితే రీజనల్ కార్యాలయాలు నెలవారీ బీఆర్ఎస్‌ను బ్యాంకులకు పంపించాలని.. పెన్షనర్ల అకౌంట్లోకి పెన్షన్ ని ఆఖరి పనిదినం రోజు ఇస్తామని అంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడైతే నెల 1 లేదా 5వ తేదీన బ్యాంకులకు పెన్షన్ మొత్తాన్ని పంపిస్తారు. కానీ ఇక నెల చివరిన రెండు రోజుల ముందుగానే బ్యాంకులకు పెన్షన్ మొత్తం ఇవ్వనుంది.
అయితే రూరల్ పీఎఫ్ కార్యాలయాల నుంచి పెన్షన్ చెల్లింపు బిల్లులు కనుక సరైన సమయానికి చెల్లించకపోతే ఇబ్బంది పడుతున్నారని గుర్తించింది. ఒకవేళ డబ్బులు అందకపోతే పెన్షన్‌ను అందించే బ్యాంకులు పెన్షనర్ల ఖాతాల్లోకి డబ్బులు వేయడం ఆలస్యం చేస్తే అవుట్ స్టాండింగ్ మొత్తంపై ఏటా 8 శాతం వడ్డీని పరిహారంగా ఇవ్వాలి. దీనిని ఆటోమేటిక్‌గా లబ్దిదారుల బ్యాంకు అకౌంట్లోకి క్రెడిట్ చెయ్యాలి. 10 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులకు 58 ఏళ్ల తర్వాత ఈపీఎస్ పెన్షన్ వస్తోంది. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్, మనీని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమ చేస్తారు.