రైతులకు గుడ్ న్యూస్..ఇకపై ఆ వివరాలు మీ మొబైల్ ఫోన్లకే..

-

మన దేశాన్ని రెక్కల కష్టం తో ముందుకు తీసుకు వెళ్తూ, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేవారిలో ముందు ఉంటాడు రైతన్న..రైతులు చెమట చిందిస్తేనె మనకు నాలుగు వెళ్ళు నోటి లోకి వెళుతున్నాయి.అందుకే రైతుల అభివృద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు సహకారాన్ని అందిస్తూ..రైతులకు కొత్త పథకాలను అమలు చేస్తున్నారు. కాగా, ఇప్పుడు భారత వాతావరణ శాఖ కూడా తమ వంతు సాయాన్ని చేయడానికి ముందుకు వచ్చింది.

రైతులకు వారి స్థానిక భాషలో SMS ద్వారా వాతావరణ సూచనను అందించే పథకంపై IMD పని చేస్తోంది. ఈ సేవ పూర్తిగా ఉచితంగా అందించనుంది. ఈ సేవ కోసం హెల్ప్ లైన్ నంబర్ జారీ చేయనున్నారు. దేశంలోని ఏ ప్రాంతమైన రైతు తన గ్రామం లేదా బ్లాక్ కోసం రాబోయే ఐదు రోజులలో వర్షం, ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం వంటి వాతావరణ సమాచారాన్ని పొందవచ్చు. IMD ప్రత్యేక బృందం ఈ అప్లికేషన్‌పై పని చేస్తుంది. SMS ద్వారా ప్రాంతీయ భాషలో సమాచారాన్ని అందించనుంది.

ప్రస్తుతం, మొబైల్ యాప్ మేఘదూత్, IMD, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంయుక్త చొరవ, ఇంగ్లీష్, స్థానిక భాషలలో పంటలు, పశువులకు సంబంధించి జిల్లా స్థాయి సలహాలను అందిస్తుంది. వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగంపై సమాచారాన్ని సేకరించేందుకు IMD జిల్లా స్థాయిలో సుమారు 200 వ్యవసాయ-ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది.

గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవ కింద, వాతావరణ శాఖ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న వివిధ ICAR సంస్థల సహకారంతో జిల్లా స్థాయి వాతావరణ సూచనలను వారానికి రెండుసార్లు అందిస్తుంది. రానున్న ఐదు రోజుల జిల్లా స్థాయి వాతావరణ సూచనలో వర్షపాతం, ఉష్ణోగ్రత, గాలి వేగం, దిశ, తేమ, మేఘాల సమాచారం ఉంటుంది.వాతావరణ స్థితిని బట్టి పనులను చేసుకోవచ్చు..ఇది మన అన్నదాతల ఆదాయాన్ని పెంచడంలో ఖచ్చితంగా సహాయపడుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news