ప్రస్తుతం ఏది కోనాలని అనుకున్న కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.నిత్యావసర సరుకులు,గ్యాస్ ధరలు భారీగా పెరిగిన ఆయిల్ ధరలు అందరికి షాక్ ఇస్తున్నాయి.గ్యాస్ సిలిండర్ ధర రూ. 1000 దాటడంతో సామాన్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలన్న డిమాండ్ కూడా అనేక వర్గాల నుంచి వినిపిస్తుంది. నిత్యం ఈ అంశంపై ప్రతి పక్షాలు సైతం కేంద్రంలోని మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలే ప్రతిపక్షాల ప్రధాన అంశాలుగా మారే అవకాశం కూడా ఉంది..
కాగా, ఇప్పుడు ప్రతిది కూడా ఆన్‌లైన్‌లో నే బుక్ చేసుకోనే వెసులుబాటును కల్పిస్తున్నాయి.వివిధ బిల్లులను సైతం ఫోన్ పే, జీపే, పేటీఎం లాంటి యాప్ ల నుంచి చెల్లించుకోవచ్చు. ముఖ్యంగా కరెంట్ బిల్, ఫోన్ బిల్, ఎల్ఐసీ తదితర బిల్స్ ను ఈ యాప్ ల ద్వారా చెల్లించుకోవచ్చు. ఇంకా గ్యాస్ సిలిండర్ బుకింగ్ కూడా ఈ యాప్ ల ద్వారా చేసుకోవచ్చు..కస్టమర్లను ఆకర్షించే విధంగా కొన్ని యాప్ లు కొన్ని ఆఫర్లను ప్రకటిస్తున్నారు..క్యాష్ బ్యాక్ ఆఫర్లతో పాటు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇలాంటి ఆఫర్లను ఇవ్వడంలో Paytm ముందు వరుసలో ఉంటుంది.
తాజాగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై బంపరాఫర్ ప్రకటించింది పేటీఎం. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ఏకంగా 100 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది.. వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకోనే సమయంలో FREEGAS అనే ప్రోమో కోడ్ ను అప్లై చేస్తే ఈ ఆఫర్ ను అందుకోవచ్చు. అయితే.. పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న ఖాతదారులందరికీ ఈ ఆఫర్ లభించదు. బుక్ చేసుకునే ప్రతీ 500వ కస్టమర్ కు ఈ ఆఫర్ లభిస్తుందని పేటీఎం స్పష్టం చేసింది. ఇంకా మరో ఆఫర్ సైతం పేటీఎంలో అందుబాటులో ఉంది. GAS1000 అనే ప్రోమో కోడ్ ను అప్లై చేయడం ద్వారా గ్యాస్ బుకింగ్ పై రూ.10-రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు..
పేటీఎం ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకోవడానికి ఖాతాదారులు వీటిని తప్పక ఫాలో అవ్వాల్సిందే..
ముందుగా పేటీఎం యాప్ ఓపెన్ చేయాలి. Recharge & Bill Payments విభాగంలో Book Gas Cylinder ఆప్షన్ ను ఎంచుకోవాలి..తర్వాత మీ గ్యాస్ ప్రొవైడర్ ను ఎంచుకోవాలి. అంటే మీరు Bharatgas, HP Gas, Indaneలలో ఏది వినియోగిస్తారో దానిని ఎంచుకోవాలన్నమాట.తర్వాత మీ LPG ID లేదా రిజిస్టర్ మొబైల్ నంబర్ నమోదు చేసి Proceed ఆప్షన్ ను క్లిక్ చేయాలి..మీరు చెల్లించాల్సిన అమౌంట్ ఎంతో కనిపిస్తుంది. స్క్రీన్ కింద Apply Cashback Offer అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పైన తెలిపిన ప్రోమో కోడ్ లలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి. Proceed పై క్లిక్ చేసి డబ్బులు చెల్లించాలి..అంతే క్యాష్ బ్యాక్ ఆఫర్ ను పొందవచ్చు..