ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా జీతాలు పెంపు..

-

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూసులు చెప్తున్నా సంగతి తెలిసిందే.. ఇప్పటికే జీతాలను భారీగా పెంచింది.ఇప్పుడు సర్కార్ మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.డీఏను 4శాతం పెంచుతూ… కేబినెట్ నిర్ణయం తీసుకుంది.దీంతో ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి పెరగనుంది. ఈ మేరకు కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు.


డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై 12 వేల 815 కోట్ల భారం పడనున్నట్లు కేంద్రమంత్రి చెప్పారు. జులైలో మళ్లీ డీఏ పెరగనుందట. అప్పుడు 42 శాతం నుంచి మరో 4 శాతం పెరిగి 46 శాతానికి పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల పెరిగిన 4 శాతం డీఏతో 50 లక్షల కేంద్ర ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని డీఏను ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్రం పెంచుతూ ఉంటుంది. తాజాగా ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు 4 శాతం పెంచింది.

మళ్లీ జులై నెలలో మరో 4 శాతం పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. దాని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.మరోవైపు వంట గ్యాస్, సీఎన్జీ ధరలు సైతం తగ్గనున్నాయి. అంతర్జాతీయ ధరలతో సంబంధం లేకుండా గ్యాస్ ధరలు భారతీయ క్రూడ్ మార్కెట్‌తో అనుసంధానం కానున్నాయి. సహజ వాయువు ధర భారతీయ క్రూడ్ బాస్కెట్ నెలవారీ సగటులో పది శాతం ఉంచాలని నిర్ణయించింది. స్థిరమైన ధరను నిర్ధారించడానికి కొత్త విధానాన్ని అమలు చేయనుంది…నెలవారీగా గ్యాస్ రేట్ల నిర్ణయించనున్నారు. ప్రతికూల మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి ప్రజలకు, ఉత్పత్తిదారులకు ఉపశమనం అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది..ఉద్యోగులు ప్రభుత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news