SBI కస్టమర్లకు గుడ్ న్యూస్..వాట్సాప్ నుంచే సేవలు..

-

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కస్టమర్లకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.ముఖ్యంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సరికొత్త సేవలను అందిస్తూ వస్తుంది.ఇప్పటికే ఆన్ లైన్, ఆఫ్ లైన్ సేవల్లో అనేక వినూత్న ఆవిష్కరణలతో ముందుకు సాగిపోతోంది. ఈ క్రమంలో నే ఎస్బీఐ వాట్సాప్ సేవలకు శ్రీకారం చుట్టింది. పూర్తి ఉచితంగా ఈ సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఒక క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు. ఆ సేవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వాట్సాప్ ద్వారా పొందే సేవలు..

1. అకౌంట్ బ్యాలెన్స్
2. మినీ స్టేట్‌మెంట్
3. డిపాజిట్ లపై సమాచారం (సేవింగ్స్ ఖాతా, రికరింగ్ డిపాజిట్, టర్మ్ డిపాజిట్) – ఫీచర్లు, వడ్డీ రేట్లు
4. లోన్ పై సమాచారం (హోమ్ లోన్, కార్ లోన్, గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్) – తరచుగా అడిగే ప్రశ్నలు,వడ్డీ రేట్లు
5. NRI సేవలు (NRE ఖాతా, NRO ఖాతా) – ఫీచర్లు, వడ్డీ రేట్లు
5. ఇన్‌స్టా ఖాతాలు తెరవడం (ఫీచర్‌లు/అర్హత, అవసరాలు, తరచుగా అడిగే ప్రశ్నలు)
6. కాంటాక్ట్స్/గ్రీవెన్స్ రిడ్రెస్సల్ హెల్ప్‌లైన్‌లు
7. ప్రీ-అప్రూవ్డ్ లోన్ లపై ప్రశ్నలు (వ్యక్తిగత లోన్, కార్ లోన్, టూ వీలర్ లోన్)
8. పెన్షన్ స్లిప్..

ఎలా రిజిష్ట్రేషన్ చేసుకోవాలంటే?

ముందుగా మీ బ్యాంకు రిజిస్ట్రేషన్ నంబర్ నుంచి WAREG A/C No టైప్ చేసి 917208933148కు ఎస్ ఎం ఎస్ చేయాలి.
ఈ రిజిస్ట్రేషన్ పూర్తయితే మీకు ఓ పాప్ అప్ మెసేజ్ వస్తుంది. దానిని ఓపెన్ చేసి వాట్సాప్(909022690226) లో Hi అని మెసేజ్ చేయాలి.
తర్వాత చాట్ బోట్ ఇనస్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి.
అప్పుడు మీకు అప్షన్ లు కనిపిస్తాయి మీకు కావలసిన సమాచారన్ని సులువుగా పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news