గ్రూప్-3 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. వీలైనంత త్వరలో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. రానున్న జులై లేదా ఆగస్టులో గ్రూపు-3 పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మొత్తం 1363 ఖాళీల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం రాత్రి ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు ఫిబ్రవరి 23 వరకు గడువిచ్చారు.
టీఎస్‌పీఎస్‌సీ తన వెబ్‌సైట్లో సవివర నోటిఫికేషన్‌ను పూర్తి వివరాలతో పాటు దరఖాస్తుల కోసం లింక్‌ను కూడా పొందుపరిచింది. అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి అభ్యర్థి 12 కేంద్రాలను ప్రాధాన్యం వారీగా ఎంపిక చేసుకోవచ్చు. మూడు పేపర్లకు 450 మార్కులు ఉంటాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష జరుపుతారు.