తెలంగాణ రైతన్నలకు కెసిఆర్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆగష్టు 16 నుండి రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అవుతుందని స్పష్టం చేసింది కెసిఆర్ సర్కార్. ఈ విడతలో ఏకంగా ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లోకి రూ. 2006 కోట్ల రుణ మాఫీ డబ్బులు జమ కానున్నాయి.

రూ. 50 వేల లోపు రుణాలు తీసుకున్న అందరికీ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది. బ్యాంకర్లు రుణ మాఫీ మొత్తాన్ని ఏ ఇతర ఖాతా కింద జమ చేయవద్దని.. పూర్తిగా రుణా మాఫీ ఖాతాలోనే జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రుణ మాఫీ జరిగిన రైతుల అక్కౌంట్లు జీరో చేసి కొత్తగా పంట రుణాలు ఇవ్వాలని.. బ్యాంకర్ల సమావేశంలో మంత్రుల హరీశ్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం లో బ్యాంక్ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. కాగా ఇప్పటికే.. 25 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ అయిన సంగతి తెలిసిందే.