తెలంగాణలో స్థానిక ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్లకు వేతనాలు విడుదల చేస్తూ తెలంగాణ సర్కారు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. తెలంగాణలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రతి నెలనెల వేతనాలు చెల్లించడం అనవాయితీ. అయితే కేసీఆర్ సర్కారు ప్రజాప్రతినిధుల వేతనాలను ప్రతిమూడు నెలలకు ఓసారి విడుదల చేస్తుంది. అయితే గతంలో కేసీఆర్ సర్కారు వేతనాలు ఇవ్వకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు.
2019-20 బడ్జెట్‌తో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం రూ.174 కోట్లను కెటాయించింది. అయితే గతంలో ఈ నిధుల్లో కేవలం రూ.108 కోట్లు మాత్రం తెలంగాణ సర్కారు విడుదల చేసింది. దీంతో రూ.66 కోట్లు మిగిలాయి. అయితే ఈ నిధులు విడుదల కాకపోవడంతో అనేకమంతి ప్రజాప్రతినిధులకు వేతనాలు పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులకు వేతనాలు బకాయి ఉండపోయాయి. దీంతో దసరా పండుగ రాగానే ప్రభుత్వం కేవలం రూ.32 కోట్లను విడుదల చేసింది.
ఇప్పుడు తెలంగాణ సర్కారు విడుదల చేసిన రూ.32 కోట్లతో కొందరికి మాత్రమే వేతనాలు ఇవ్వవచ్చు. అయితే ఇంకా తెలంగాణ సర్కారు రూ.34 కోట్లు బకాయి పడిందనే చెప్పవచ్చు. ఈ నిధులను కూడా విడుదల చేస్తే స్థానిక ప్రజాప్రతినిధులకు పూర్తిస్థాయిలో వేతనాలు అందేవి. ఇప్పుడు ఇచ్చిన నిధుల కూడా పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడంతో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇక్కట్లు ఎదుర్కోనే ప్రమాదం ఉంది. తెలంగాణ సర్కారు ఇకనైనా పూర్తిస్థాయిలో నిధులను విడుదల చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ సర్కారు విడుదల చేసిన నిధులు కనీసం పదిహేను రోజులు ముందు విడుదల చేస్తే ఎంతో బాగుండేదని, ఇప్పుడు దసరా పండుగకు అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజాప్రతినిధులు ఆవేధన చెందుతున్నారు. తెలంగాణ సర్కారు పూర్తిస్థాయిలో నిధులను విడుదల చేస్తే బాగుంటుందని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.