దేశ ఆదాయం పన్ను చెల్లింపు దారుల మీదనే ఆధారపడి ఉంటుంది. మరి దీన్ని కేంద్రం ఇంకెంత ఖచ్చితంగా నిర్వహించాలనుకుంటుంది. ఇప్పటికీ పన్నులు చెల్లించేందుకు అనేక పద్ధతులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఆదాయపు పన్ను రిటర్నులను మరింత సులభతరం చేసింది.
మొబైల్ ఫోనులోనూ చెల్లింపులు చేసే విధంగా ఈ-ఫైలింగ్ 2.0తో కొత్త పోర్టల్ రానుంది. పన్ను చెల్లింపుదారుల కోసం ఐటీ విభాగం ఈ పోర్టల్‌ను జూన్ 7న ప్రారంభించనుంది. కొత్త వెబ్‌సైట్ ఇప్పటికే ఉన్న పోర్టల్ incometaxindiaefiling.gov.in స్థానంలో రానుంది.
అయితే ఈ కొత్త వెబ్‌సైట్ ప్రారంభించటానికి ముందు, జూన్ 1 నుంచి 6 మధ్య ఈ-ఫైలింగ్ సేవలు ఉండవని చెప్పింది. జూన్ 7 న కొత్త ఈ-ఫైలింగ్ వెబ్ పోర్టల్ incometax.gov.in అమల్లోకి వస్తుంది. ప్రతి ఒక్కరూ దీంట్లో పేమెంట్‌చే యొచ్చు. ఇందుకోసం ముఖ్యమైన ఫీచర్లను ఐటీ విభాగం వివరించింది. కొత్త యాప్ తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ యాప్ ద్వారా చెల్లింపులు చేయొచ్చని స్పష్టం చేసింది.