మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన తూర్పు గోదావరి జిల్లా లో కొన్ని చోట్ల ఆశా వర్కర్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
ఈ పోస్టులకి అప్లై చేసుకునే మహిళల వయస్సు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత విషయానికి వస్తే.. ఈ మహిళలు పదో తరగతిలో ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. కేవలం మహిళలు మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి. ఈ విషయాన్నీ నోటిఫికేషన్ లో చెప్పారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు సంబంధిత గ్రామానికి చెందిన వివాహిత/విడో/డివోర్స్/ఒంటరి మహిళై ఉండాలి.
డిసెంబర్ 15, 2022వ తేదీ వరకే అప్లై చేసుకోవడానికి అవకాశం వుంది. కనుక ఈ లోపు అప్లై చేసుకోండి. మెరిట్ లిస్ట్ డిసెంబర్ 21న ప్రకటించనున్నారు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే టెన్త్ క్లాస్ మార్కులు, రిజర్వేషన్, అనుభవం ని చూసి ఎంపిక చేస్తారు. సాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.10,000ల వరకు జీతంగా ఇస్తారు. పూర్తి వివరాలని మీరు https://eastgodavari.ap.gov.in/ లో చూడచ్చు. కింది అడ్రెస్ కి దరఖాస్తు పంపాల్సి వుంది.
DMHO, Kakinada, East Godavari, AP.