ఏపీలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. జగనన్న అమ్మఒడి పథకం నిధులను ఈ నెల 28న విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేయనున్నారు. పూర్తి వివరాలు చూస్తే.. జగనన్న అమ్మఒడి పథకం నిధులను ఈ నెల 28న విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనున్నారు. 2022-23వ సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల తల్లుల అకౌంట్‌ల లో ఈ డబ్బులు జమ అవుతాయి.
ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.15వేల నుంచి స్కూల్, మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం రూ.2వేలు అమ్మ ఒడి నుండి మినహాయిస్తున్నారు. మిగతా రూ.13వేలు మాత్రమే తల్లుల బ్యాంకు ఖాతా లో పడనున్నాయి. ఈ పథకానికి అర్హులు ఎవరనేది చూస్తే.. కుటుంబ ఆదాయం పట్టణాల్లో నెలకు రూ.12వేలు, గ్రామాల్లో రూ.10వేల లోపు ఉంటే వాళ్ళు ఈ స్కీము కి అర్హులే.
అలానే విద్యుత్తు వినియోగం నెలకు 300లోపు యూనిట్లు ఉండాలి. ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో మినహా ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉంటే అనర్హులు. మున్సిపాలిటీ వెయ్యి చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థిరాస్తి ఉంటే కూడా అర్హులు కారు. అర్హత కలిగిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబానికి ఈ స్కీము బాగా హెల్ప్ అవుతోంది.