గుడ్ న్యూస్: పెరిగిన రూపాయి విలువ… ముందు ముందు డాలర్ పడిపోయే ప్రమాదం !

-

గత కొంతకాలంగా డాలర్ విలువ పెరుగుతూ పోయిన కారణంగా మన దేశ కరెన్సీ రూపాయి విలువ పడిపోయింది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రూపాయి విలువ స్వల్పముగా మెరుగుపడిందట. ఈ రోజు మన దేశ స్టాక్ మార్కెట్ లు లాభాలతో ముగిసిన కారణంగా రూపాయి విలువ కొంచెం మెరుగైన పెరుగుదలను పొందింది. ఈ రోజుకు ముందు వరకు ఒక డాలర్ రూ. 82 .06 గా ఉన్నది, కానీ ఇప్పుడు డాలర్ కు రూ. 81 .91 గా నమోదు అయింది. అంటే రూపాయి విలువ 15 పైసల వరకు పెరిగింది.

అయితే రూపాయి విలువ పెరగడానికి ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు తగ్గడం కూడా ఒక కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ర్నాఉన్న రోజుల్లో డాలర్ విలువ ఇంకా దిగువకు పడిపోయే ప్రమాదం లేకపోలేదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news