ఇదేందయ్యా.. జ్యూస్‌ త్వరగా తీసుకురాలేదని కోడలిని గెంటేసిన అత్త

-

అడిగిన వెంటనే మ్యాంగో జ్యూస్ తీసుకురాలేదని ఆమెను భర్త, అత్తమామలు ఇంటి నుంచి గెంటేసిన ఘటన అహ్మదాబాద్ లోని పాల్దీ ఏరియా జరిగింది. అసలు విషయంలోకి వెళ్లితే… గుజరాత్ కు చెందిన 29 ఏళ్ల మహిళకు అహ్మదాబాద్ లోని పాల్దీ ఏరియాకు చెందిన వ్యక్తితో తన వివాహం గతేడాది జనవరి 23న జరిగిందని ఆమె వెల్లడించింది. పెళ్లయిన నాటినుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవారని, ఇంట్లో పనుల విషయంలోనూ తనను తిట్టేవారని ఆరోపించింది. గతేడాది మే 1న మ్యాంగో జ్యూస్ తీసుకురావాలంటూ అత్తగారు చెప్పారని, అయితే తాను టాయిలెట్ కి వెళ్లాల్సి రావడంతో మ్యాంగో జ్యూస్ చేయడం ఆలస్యమైందని ఆమె వివరించింది. అత్తగారు మాత్రం అదేమీ పట్టించుకోకుండా, మ్యాంగో జ్యూస్ ఎందుకు ఆలస్యంగా తీసుకువచ్చావంటూ మండిపడిందని, తనపై చేయి కూడా చేసుకుందని వివరించింది. అంతేకాదు, తనను ఇంటి నుంచి బయటికి తోసేసిందని, ఇంత జరుగుతున్నా తన భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఒక్క మాట కూడా మాట్లాడలేదని వాపోయింది.

In laws and husband abandoned woman due to late serving of mango juice త వారితో సఖ్యంగా ఉండేందుకు తాను ప్రయత్నించినా, రాజీ పడేందుకు వారు ససేమిరా అన్నారని ఆ మహిళ తన ఫిర్యాదులో వెల్లడించింది. అంతేకాదు, కాపురం చేసే సమయంలో, అత్తగారి దాష్టీకం దారుణంగా ఉండేదని, ఆమె అనుమతి లేనిదే తాను వంట గదిలోకి వెళ్లలేకపోయేదాన్నని, ఆఖరికి భర్తతో మాట్లాడాలన్నా అత్తగారి అనుమతి ఉండాల్సిందేనని వివరించింది. నవంబరు 3న అత్తమామలు తనను విడాకుల పేరుతో బెదిరించారని వెల్లడించింది. గృహ హింస కింద కేసు నమోదు చేయాలంటూ పాల్దీ పోలీసులను కోరింది. అత్తమామలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది. ఏడాది కిందట ఈ ఘటన జరిగింది. దీంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news