దారుణం: అమ్మాయిపై “ప్రేమికుడు కత్తితో దాడి” !

-

ప్రస్తుతం సమాజంలో మనకు తెలిసో లేదా తెలియకో చాలా దారుణాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా ప్రేమికుల మధ్యనే ఈ హత్యలు మరియు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని హైద్రాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఘటన ఎందరో ప్రేమికులను అలెర్ట్ చేసిందని చెప్పాలి. హైదరాబాద్ లోని బోరబండ కు చెందిన బంజారానగర్ లో జరిగిన ఘటన ఆ చుట్టుపక్కల వారిని నిర్ఘాంతపోయేలా చేసింది. ఆ ప్రాంతానికి చెందిన ఒకమ్మాయిని ఒక ప్రేమ ఉన్మాది గత కొంతకాలంగా ప్రేమిస్తున్నట్లున్నాడు.

అయితే ఆ అమ్మాయికి ఇష్టం లేడని సంఘటన జరిగిన విధానాన్ని బట్టి చూస్తే క్లియర్ గా అర్ధం అవుతోంది. కానీ ఇతను రోజూ ప్రేమించాలని వేధిస్తూనే ఉన్నాడు. ఇంతకీ వినకపోవడంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఎవరూ లేని సమయం చూసి ఆమె గొంతు కోయాలని చూశాడు. కానీ చుట్టుపక్కల వారు గమనించి అతనిని చితకబాదారు.

Read more RELATED
Recommended to you

Latest news