తెలుగు రాష్ట్రాలలో రావాల్సిన సమయంలో కాకుండా వేరే సమయంలో వర్షాలు పడుతున్న విషయం మనము చూస్తున్నాము. అకాల వర్షాల కారణంగా వేల ఎకరాల ధాన్యం వర్షపు నీటిలో తడిసిపోయింది. దీనితో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా వీరికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్తను అందించారు, అధికారికంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తడిసిన ధాన్యం అంతటినీ కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశాలను జరీ చేశారు. ఇక కొత్త తర్వాత ధాన్యం ఎక్కడ ఉన్నా సరే వర్షాల నుండి కాపాడాలను చెప్పారు.
ఈ వరి నిల్వలు ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఆ ధాన్యాన్ని గోదాములు మరియు కోల్డ్ స్టోరేజ్ లలో ఉంచి భధ్రపరచాలని చెప్పారు. కాగా ఇన్పుట్ సబ్సిడీ విడుదల కావడానికి సైతం అధికారులు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. దీనితో రైతులు ఈ వార్త విన్న తర్వాత సంతోషపడుతారు.