NTR ఫ్యాన్స్ కు పానకం లాంటి వార్త.. షూటింగ్ స్టార్ట్ !

-

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాలపై పూర్తిగా తన దృష్టిని సారించనున్నాడు. ఈ మధ్యనే ఆర్ ఆర్ ఆర్ లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శ్రీరామనవమి లాంటి శుభదినాన గుడ్ న్యూస్ వినిపించింది NTR 30 చిత్రబృందం. ఎప్పటి నుండో షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అంటూ కళ్ళు కాయేలా ఎదురుచూసిన అభిమానులకు తీపి వార్తను అందించారు. మార్చ్ 31వ తేదీన ఎన్టీఆర్ కెరీర్ లో చేస్తున్న 30వ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయనున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ ఊరమస్ పాత్రలో నటించనున్నాడని పోస్టర్ రివీల్ చేసినప్పుడే అర్థమైంది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ అందాలతార శ్రీదేవి తన జాన్వీ కపూర్ నటించనుంది. కొరటాల శివ గత చిత్రం నిరాశను మిగిల్చడంతో ఇప్పుడు ఈ సినిమాను ఎలాగైనా హిట్ కొట్టాలని కష్టపడుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news