హిట్ కోసం పెద్ద ప్లాన్ వేసిన గోపి చంద్ ..!!

-

మాన్లీ హీరో గోపి చంద్ కు  కొంతకాలంగా  మంచి హిట్ అనేది కుండా పోయింది.ఎన్నో ఆశలు పెట్టుకున్న పక్కా కమర్షియల్ సినిమా కూడా తనని ఆదుకోలేక పోయింది. తాను ఎంత గా కష్టపడుతూ ఉన్నా కూడా విజయం దరి చేరకుండా ఉంది. ఎంతగా కథల లో వైవిద్యం చూపిస్తున్న కూడా లాభం లేకుండా పోయింది. ఇక తనకు గతంలో హిట్ ఇచ్చిన  డైరెక్టర్ శ్రీవాస్ ను మళ్లీ నమ్ముకున్నాడు.

ఇప్పుడు గోపీచంద్ ఆశలన్నీ రాబోయే శ్రీవాస్ సినిమాపైనే ఉన్నాయి. 2014లో వచ్చిన ‘లౌక్యం’ తర్వాత ఆ స్థాయి హిట్ మళ్ళీ గోపీకి దక్కలేదు. మధ్యలో ‘జిల్, సీటీమార్’ వంటి యావరేజ్ సినిమాలు ఉన్నా మిగిలినవి అన్నీ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చినవే.దీంతో ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని తనకు రెండు హిట్లు ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ నే గోపీచంద్ నమ్ముకున్నాడు.

తాజాగా ఈ సినిమాకు టైటిల్ గా  రామ బాణం సెలెక్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది ను.త్వరలోనే టైటిల్ ఎనౌన్సమెంట్ కానుంది. తాజాగా ప్రభాస్ తో కలిసి గోపీచంద్ అన్ స్టాపబుల్ షో కి వస్తున్నాడు.  వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ టైటిల్ ను బాలయ్య షోలో నే రివిల్ చేసి హైప్ వచ్చేలా చూడాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక అక్కడ ప్రభాస్ కూడా ఉంటాడు కాబట్టి ట్రెండింగ్ లోకి వస్తుందని ప్లాన్. ఈ సినిమా తో అయినా గోపీచంద్ రామబాణం లా దూసుకొని పొయి హిట్ కొడతాడేమో చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news