ఈ నెల 17న అమరావతి పరిరక్షణ సమితి ధర్నా

-

రాజధాని అమరావతి పరిరక్షణ ఆందోళన కార్యక్రమాలను మరింత ఉదృతం చేసేందుకు అమరావతి పరిరక్షణ సమితి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఢిల్లీ వేదికగా నిరసనలు తెలిపేందుకు అమరావతి పరిరక్షణ సమితి సిద్ధమైంది. ఈ నెల 17, 18, 19 తేదీలలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వివిధ కార్యక్రమాలు నిర్వహించనుంది.

అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధుల మహా ధర్నా నిర్వహించనున్నారు. 18న ఇతర రాష్ట్రాల ఎంపీలను కలవనున్నారు. 19న రామ్ లీలా మైదానంలో జరిగే కిసాన్ సంఘ్ లో పాల్గొంటారు. 1800 మందితో ప్రత్యేక రైలులో రాజధాని ప్రాంత రైతులు ఢిల్లీ వెళ్తారని చెప్పారు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి, కార్యదర్శి గద్ద తిరుపతిరావు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news