జనవరి 12న “యువశక్తి” పేరుతో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ

-

కౌలు రైతు భరోసా, జనవాని కార్యక్రమాలు విజయవంతం కావడంతో జనసేన పార్టీ ఏపీలో మరో కొత్త కార్యచరణకు రూపకల్పన చేసింది. యువశక్తి పేరిట ఏపీలో బహిరంగ సభలో నిర్వహించేందుకు సిద్ధమైంది జనసేన. మొదట వచ్చే ఏడాది జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరుతో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది.

జనవరి 12న ఉదయం 11 గంటలకు ఈ బహిరంగ సభ ఉంటుందని ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గలమెత్తడం కోసమే యువశక్తి సభలు నిర్వహిస్తామని గతంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సభల ద్వారా రాష్ట్రంలోని యువతకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news