ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ తీపికబురు అందించారు. అమరావతిలో ఉద్యోగులకు ఉచిత వసతి కి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వసతిని మరో రెండు నెలలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులకు ఉచిత వసతిని మరో రెండు నెలల పాటు కల్పించనున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.
ఆగస్టు 31వ తేదీ వరకు ఉద్యోగుల వసతిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ సచివాలయం, అసెంబ్లీ, విభాగాధిపతులు, హైకోర్టు అలాగే రాజ్ భవన్ ఉద్యోగులకు కూడా ఇది వర్తించనుంది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే ఏసు జవహర్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు.
అలాగే అనుమతించిన ఉచిత వసతిని ఉద్యోగులు షేరింగ్ ప్రాతిపదికన వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచనలు చేసింది. బుధవారం మధ్యాహ్నం అమరావతి ఉద్యోగులకు ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన వసతి రద్దు చేస్తున్నట్లు అధికారిక ఉత్తర్వులు కూడా ఇచ్చింది. గురువారం లోగా సదరు ఉద్యోగులు ఉంటున్న ఫ్లాట్ కాల్ చేసి ఇవ్వాలని.. వాడిని మంచి స్థితిలో అప్పగించాలని తెలిపింది.