జూన్ 30 గురువారం రాశి ఫలాలు..

-

జూన్ 30 గురువారం ఏ రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..

మేషం: ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలు మార్చుకుంటారు..ఈరోజు ఆలోచన తో ముందుకు సాగాలి.

వృషభం: సన్నిహితులతో కుటుంబమున ఉత్సహంగా గడుపుతారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో సంతోషంగా గడుపుతారు..

మిథునం: బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. రుణయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఋణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి..ఇష్ట దైవాన్ని ప్రార్దించితే మంచిది.

కర్కాటకం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

సింహం: చేపట్టిన వ్యవహారాలలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. ఉద్యోగమున కొన్ని వ్యవహారాలలో చిక్కులు అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు..దైవదర్శనాలు చేయడం మంచిది.

కన్య: కొన్ని పనులలో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు.

తుల:  వాహన లాభాలు ఉన్నవి. సమాజంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయట పడగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు.కొత్త వ్యవహారాలు లాభిస్తాయి..

వృశ్చికం: చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు అంతగా బాగుండవు..

ధనస్సు: దూరప్రయాణంలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. ఆరోగ్య విషయమై వైద్య సహాయం అవసరం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి.

మకరం: వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. స్థిరాస్తి లాభం కలుగుతుంది. చేపట్టిన పనులు ఆలస్యం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దైవారాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి..

కుంభం: ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. ముఖ్యమైన పనులలో కావాల్సిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. మిత్రుల ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి..ఈరోజు సంతోషంగా ఉంటారు.

మీనం: ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండవు..ఆలోచనలు స్థిరంగా ఉండవు.. కొత్త పనులు వాయిదా పడతాయి.ఖర్చులు అధికం..

Read more RELATED
Recommended to you

Latest news