చిన్నారిని చిదిమేసిన నిందితుడిని వదిలే ప్రసక్తే లేదు : మంత్రి శ్రీధర్ బాబు

-

ఇటీవలే పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారి పై అత్యాచారం చేసి హత్య చేసిన విషయం విధితమే. తాజాగా ఈ ఘటన పై మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క మీడియాతో మాట్లాడారు. చిన్నారిని చిదిమేసిన నిందితుడినీ వదిలేది లేదన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి కఠిన శిక్ష విధిస్తామని తెలిపారు. రైస్ మిల్లు లో పని చేస్తున్న వారి పై వివరాలు తెలుసుకునేందుకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని.. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సిరీయస్ గా ఉందని వెల్లడించారు.

ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మంత్రి శ్రీధర్ బాబు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారి సరైన వివరాలు తెలుసుకొని రైస్ మిల్లు యజమానులు పని లోకి తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా అదుకుంటుందని వెల్లడించారు. ప్రభుత్వం తరుపున 2.50 లక్షలు, రైస్ మిల్లు తరుపున మరో 5 లక్షలు పరిహారం అందిస్తామని తెలిపారు. బాధిత కుటుంబంలో ఒకరికీ ఉద్యోగం, ఇల్లు, మరో చిన్న పాప చదువులకు ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news