కరోనాకి తెలంగాణ ఎమ్మెల్యే చిట్కా.. ఆ కషాయం తగాల్సిందే..!

-

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ఎన్నో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు, పోలీసులు, ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారినపడుతున్నారు. అయితే ఈ మహమ్మారి బారిన పడినవారిలో చాలా మంది కోలుకోని బయటపడుతున్నారు. ఇదే క్రమంలో కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరిన ప్రభుత్వ విప్, ఆలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత కరోనా నుంచి పూర్తిగా కోలుకోని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సునీతతో పాటు కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరిన ఆమె భర్త మహేందర్ రెడ్డి కూడా కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఈ సందర్భంగా గొంగిడి సునీత మాట్లాడుతూ.. గతంలో క్షయ వ్యాధిలాగా ఇప్పుడు కరోనా వ్యాధి ప్రబలుతోందని, అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గుండెజబ్బులు, డయాలసిస్, మూత్రపిండ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని సునీత వివరించారు. కరోనా సోకితే తాను కొన్ని జాగ్రత్తలు పాటించినట్లు చెప్పారు. అల్లం, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు నీళ్లలో వేసుకొని మరగబెట్టి తాగానని చెప్పారు. అంతేకాక, రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టడం వల్ల చాలా ఉపశమనం ఉంటుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news