సంచలనం : తెలంగాణ సీఎంగా కోట శ్రీనివాసరావు..!

-

కోట శ్రీనివాస‌రావు.. తెలుగు ప్రజలకి పరిచయం అక్కర్లేని పేరు. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఈయన చేయని పాత్ర అంటూ లేదు. ఇప్పటి వరకు ఎన్నో వందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసాడు కోట శ్రీనివాస‌రావు. అయితే ఇప్పుడు తాజాగా.. ఓ సినిమాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆర్. రామన్న చౌదరి పాత్రలో నటిస్తున్నారు. జులై 10న కోట శ్రీనివాసరావు జన్మదిన సందర్భంగా సదరు సినిమా యూనిట్ ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ‘రొరి’ అనే సినిమాలో కోట ముఖ్యమంత్రిగా నటిస్తున్నారు.

ఇందులో చాలా సెన్సిటివ్ ముఖ్యమంత్రిగా వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు కోట శ్రీనివాసరావు. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న ముఖ్యమంత్రి పాత్రను ఆర్‌. రామన్న చౌదరిగా పరిచయం చేశారు. ఈ చిత్రాన్ని సీటీఎస్‌ స్టూడియోస్‌, ఎస్‌టీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్లపై చరణ్‌ రోరి నిర్మిస్తున్నారు. ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి భీన్స్ సంగీతం సమకూరుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news