మహానటి రూట్ లోనే ఎన్టీఆర్

-

బయోపిక్ సినిమాలకు ఓ కొత్త ఎనర్జీ వచ్చేలా చేసిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన మహానటి సినిమా అంచనాలను మించి సూపర్ హిట్ అయ్యింది. బయోపిక్ అంటే ఇలానే చేయాలి అన్న పంథాని మార్చేశాడు నాగ్ అశ్విన్. ఇక ఇప్పుడు అదే రూట్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ కూడా వస్తుందట. సినిమా ఓపెనింగ్ సీన్ బసవతారకం చివరి దశలో క్యాన్సర్ ట్రీట్ మెంట్ చేసుకోవడంతో మొదలు పెడుతున్నారట.

ఆపరేషన్ థియేటర్ బయట ఎన్.టి.ఆర్ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకునేలా మొదటి సీన్ ఉంటుందట. చిన్ననాటి నుండి యవ్వనం వరకు అలా చూపిస్తారట. మొదటి పార్ట్ లో అరగంట తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ చూపిస్తారట. చూస్తుంటే మహానటి సినిమా స్పూర్తితోనే ఎన్.టి.ఆర్ సినిమాను తెరకెక్కించారని చెప్పొచ్చు. అయితే ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది.

ఈమధ్య ఆడియో రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. రెండు పార్టులుగా సినిమా వస్తున్నా ట్రైలర్ మాత్రం ఒకటే కట్ చేయడం విశేషం. ఎన్.టి.ఆర్ కథానాయకుడు జనవరి 9న వస్తుంది. మహానాయకుడు ఫిబ్రవరి 8న రిలీజ్ ప్లాన్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news