గ్రేటర్ వరంగల్ అధికారుల తీరుతో మళ్లీ రాజుకున్న వివాదం

Join Our Community
follow manalokam on social media

గ్రేటర్ వరంగల్ అధికారుల తీరు వివాదస్పదంగా మారుతోంది. ఇప్పటికే ఓ మారు ఫ్లెక్సీల వివాదం టీఆర్ఎస్,బీజేపీల మధ్య చిచ్చు రేపగా ఇప్పుడు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు మరో వివాదాన్ని రాజేశాయి. పెద్ద నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు ఉంచి ఛోటామోటా నేతలవి మాత్రం అధికారులు సిబ్బందితో తీసేస్తున్నారట. దీనిపై అధికార పార్టీ నేతల మధ్యే మొదలైన వివాదం పరస్పర ఫిర్యాదులతో గ్రేటర్ వరంగల్ లో హీట్ పుట్టిస్తుందట..

ప్లెక్సీలు పెట్టొద్దంటారు..పెట్టిన వాళ్లని తీసేయమంటారు. మాటవినకపోతే సిబ్బంది రంగంలోకి దిగి స్వయంగా తొలగిస్తారు. ఇదీ జరగాల్సిన విషయం. ఫెక్సీల తొలగింపులో కొందరివి తొలగించి మరి కొందరివి వదిలేయడంపై అధికార పార్టీ నేతల్లోనే అసంతృఫ్తి ఉంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఇప్పటికే ఆందోళన చేస్తే, అధికార పార్టీ నేతలు సైతం వారిపై ఫిర్యాదుకు సిద్దపడుతున్నారట.

సీఎం కేసిఆర్ పుట్టిన రోజు సందర్బంగా నరగంలో చాలా చోట్ల ఫెక్సీలు వెలిశాయి. ముఖ్యమంత్రి కేసిఆర్ ను ప్రసన్నం చేసుకోవడం కోసం చాలా మంది ప్రజా ప్రతినిధులు అయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేశారు. కొందరు నేతలైతే మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించారు. ఇందులో బాగంగా పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిదులు ముఖ్యమంత్రి కేసిఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో నగరంలోఎక్కడ చూసినా ఫ్లెక్సీలే దర్శనం ఇచ్చాయి.

కేసిఆర్ ఫోటోలతో పాటు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల పై కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో నగర పాలక సంస్థ రాత్రికి రాత్రి వాటిని తొలగించాలంటూ ఆదేశించింది. ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు తొలగించకపోవడంతో కార్పోరేషన్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే ఎంపీ స్థాయి ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకుండా, ఛోటా మోటా నేతలు పెట్టిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించారనే ఆరోపణలున్నాయి. త్వరలో జరిగే కార్పొరేషన్ ఎన్నికలకు ఉపయోగపడేలా ఆశావహులు ఏర్పాటు చేసిన వాటిని తొలగించి .. ఎమ్మేల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులవి మాత్రం ఉంచేశారు.

గతంలో కూడా ఈ ఫ్లెక్సీల వివాదం తెరపైకి వచ్చింది. అప్పుడు అధికార పార్టీ నేతలవి ఉంచి ఇతర పార్టీ నేతలవి తొలగించారనే వివాదం రేగింది. వివేకానందుడి జన్మదినం సందర్బంగా బిజేపి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడంతో ఏకంగా బిజేపి కార్పోరేషన్ అఫీసు ముందు ఆందోళలను కూడా చేసింది. మరో వైపు హైదరాబాద్ లో ఏకంగా మేయర్ కే ఫైన్ వేసిన ఉదాహరణలున్నాయి. కానీ, వరంగల్‌ లో మాత్రం ప్లెక్సీల తొలగింపులో కూడా గందరగోళం ఉందనే టాక్‌ ఉంది. అదికారులు మాత్రం ఎన్నికల కోడ్‌ మేరకు ఫ్లెక్సీలను తొలగించాం అని చెప్తున్నారట.కొందరు ప్రజాప్రతినిధులకు ఏజెంట్లుగా వ్యవహారిస్తున్న సిబ్బంది కారణంగా కార్పోరేషన్ ఉద్యోగులంతా అభాసు పాలవుతున్నారనే వాదనా ఉంది.

TOP STORIES

బిజినెస్ ఐడియా: మహిళలు ఇంట్లోనే ఇలా సంపాదించవచ్చు..!

చాలా మంది మహిళలు నేటి కాలంలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ల కోసమే ఈ బిజినెస్ ఐడియాస్. వీటిని అనుసరిస్తే మీరు ప్రతి నెలా మంచి...