ప్రముఖ నటుడు ప్రభాకర్ రెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు గొప్ప దాన సంఘసంస్కర్త అని చెప్పవచ్చు.. రచయితగా, వైద్యుడిగా, నటుడిగా టాలీవుడ్ లో ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న ప్రభాకర్ రెడ్డి సూర్యాపేట జిల్లాకు చెందినవారు. మొదట వైద్య వృత్తిలో ఉన్న ప్రభాకర్ రెడ్డి నాటకాలలో నటించాలని ఆసక్తి కలగడంతో ఇలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. హిందీ, తెలుగు, తమిళ్ చిత్రాలలో ఎక్కువగా నటించిన ఈయన తన 37 సంవత్సరాల వయసులోని 500 చిత్రాలకు పైగా నటించి ఆశ్చర్యపరిచాడు. అధినాయక పాత్రలోనే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా మారి ఎన్నో సినిమాలను తెరకెక్కించడం జరిగింది. ప్రజలకు సేవ చేయాలనే కోరిక కూడా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఒకవైపు వైద్యవృత్తిని చేస్తూనే మరొకవైపు నటనను కొనసాగించాడు.ఇక 90 లలో హైదరాబాదుకి తిరిగి వచ్చిన ప్రభాకర్ రెడ్డి హైదరాబాదులో స్టూడియోలు నిర్మించడం , సినిమా హాల్స్ కట్టడం లాంటివి చేశారు. ఇక కార్మికుల కోసం ఏకంగా తన పది ఎకరాల పొలాన్ని దానం చేశారు. అది కూడా ఉచితంగా ఇవ్వడం.. చిత్రపురి కాలనీలో ఉంటున్న ఆ భూమికి ఇప్పుడు కొన్ని వందల కోట్ల విలువ ఉంది. ఇక అందుకే ఆ చిత్రపురి కాలనీకి ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని పేరు కూడా పెట్టారు. అలాగే మణికొండలో ఆయన పేరు మీదుగా ప్రభాకర్ రెడ్డి చలనచిత్రం కార్మిక చిత్రపురి అనే పేరును సైతం పెట్టడం జరిగింది.. ఇక ఎన్నో గుప్త దానాలు చేసిన ప్రభాకర్ రెడ్డి తన వ్యక్తిగత జీవితం మాత్రం ఏనాడు బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు.
ఇక ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కోట్ల విలువ చేసే భూములను దానంగా ఇచ్చిన ప్రభాకర్ రెడ్డి తన కూతుర్లకు మాత్రం పెళ్లిళ్ల సమయంలో చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదంటే ఎవరైనా నమ్మగలరా? వాస్తవానికి ఇదే నిజం అని చెప్పాలి.. ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి పై ఉన్న గౌరవంతోనే చాలామంది ఉన్నత కుటుంబాలు ప్రభాకర్ రెడ్డి కూతుర్లను కట్నం లేకుండా వివాహం చేసుకోవడం జరిగింది. ఇక అలా ఆయన పేరు సుస్థిరంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మిగిలిపోయింది అని చెప్పవచ్చు.