మహిళల వన్ డే ఫార్మాట్ లో నంబర్ వన్ ప్లేయర్ గా తాజాగా శ్రీలంక కు చెందిన చమరి అటపట్టు నిలిచింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక మహిళగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్ డే టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తూ ఉంది. మూడు వన్ డే ల సిరీస్ లో రెండు మ్యాచ్ లను గెలుచుకోవడంతో సిరీస్ ను సైతం చేజిక్కించుకుంది. ఈ సిరీస్ లో చమరి ఆటపట్టు వరుసగా రెండు సెంచరీ లు చేయడంతో ఒక్కసారిగా ఐసీసీ వన్ డే ఐసీసీ ర్యాంకింగ్ లో మొదటి స్థానానికి చేరుకుంది. కాగా ఇండియా నుండి హర్మన్ ప్రీత్ కౌర్ 6 వ స్థానంలో, స్మృతి మందన్న ఏడవ స్థానంలో కొనసాగుతున్నారు. కాగా ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్ లో ఇంగ్లండ్ బౌలర్ సోఫీ మొదటి స్థానంలో ఉంది.
ప్రస్తుతం చమరి ఆటపట్టు పై ప్రశంసల వర్షం కురుస్తోంది. శ్రీలంక మహిళల జట్టులో ఈమెదే పైచేయి అని చెప్పాలి.. ఈమె ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఆపడం ఎవ్వరూ తరం కాదు. అంతలా బౌలర్లను ఆటాడుకుంటుంది.