బ్రేకింగ్ : తెలంగాణాలో టపాసులకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

-

తెలంగాణలో బాణాసంచా వ్యాపారులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. తెలంగాణలో హైకోర్టు అన్ని రకాల క్రాకర్స్ మీద బ్యాన్ విధించగా దానికి సంబంధించి బాణాసంచా వ్యాపారులు అసోసియేషన్ ఈరోజు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు లంచ్ మోషన్ పిటిషన్ ని వ్యాపారుల సంఘం దాఖలు చేసింది. ముందు చెప్పి ఉంటే తాము అసలు సరుకు కొన్ని ఉండేవాళ్ళం కాదని ఇప్పటికిప్పుడు చెప్పడంతో కోట్ల రూపాయలు పెట్టి సరుకు కొన్న తమకు ఆత్మహత్య తప్ప మరొకటి గత్యంతరం లేదని వాళ్ళు కోర్టుకు విన్నవించుకున్నారు.

ఈ క్రమంలో హైకోర్టు నిషేధం మీద సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బాణాసంచా వ్యాపారులకు సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లయింది. ఇక సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తెలంగాణలో గ్రీన్ క్రాకర్స్ కు అనుమతి లభించినట్లు అయింది. ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. పర్యావరణహితమైన బాణాసంచా కాల్చి అని ఎన్జీటీ పేర్కొంది. అలానే దీపావళి రోజు మాత్రమే రెండు గంటల పాటు బాణసంచా కాల్చేందుకు అనుమతినిచ్చింది సుప్రీంకోర్టు. ఇక ఏ రెండు గంటలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలని గతంలో ఎన్జీటీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news