తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు అనుమతి వస్తే ఇది మా ప్రాంతానికి వద్దు, మాకు అవసరం లేదని టీడీపీ నేతలు లేఖలు రాశారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది చూసి, వస్తున్న పారిశ్రామికవేత్తలను చూసి ఓర్వలేక రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ… తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు అనుమతి వస్తే ఇది మా ప్రాంతానికి వద్దు, మాకు అవసరం లేదని లేఖలు రాస్తారు, జరుగుతున్న అభివృద్ది చూసి, వస్తున్న పారిశ్రామికవేత్తలను చూసి ఓర్వలేక రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కళ్ళు విప్పి చూడమని వారికి చెబుతున్నా, రానున్న రోజుల్లో శ్రీ జగన్ గారి నేతృత్వంలో పారిశ్రామిక అభివృద్దిని మరింతగా ముందుకు తీసుకెళతాం అని ధీమా వ్యక్త పరిచారు.
యనమల రామకృష్ణుడికి మంత్రి గుడి వాడ అమర్నాథ్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. యనమల సెల్ఫ్ సర్టిఫైడ్ మేథావి అన్న మంత్రి గుడివా అమర్నాథ్.. టీడీపీ హయాంలో తెచ్చిన లక్ష 50 వేల కోట్ల రూపాయల అప్పులకు యనమల లెక్కలు చెప్పగలరా అని ప్రశ్నించారు. పన్ను నొప్పి వస్తే సింగపూర్ వైద్యం కోసం రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. మూడేళ్ళలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల రూపంలో తెచ్చిన ప్రతీ రూపాయి ప్రజలకు చేరిందని మంత్రి చెప్పారు. వైసీపీ